
గోమాతల మృతిపై పవన్ స్పందించాలి
చిత్తూరు కార్పొరేషన్: సనాతన హిందూ ధర్మ పరిరక్షకుడని చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోమాతల మృతిపై స్పందించాలని వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం చిత్తూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బీఆర్ నాయు డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీటీడీ అప్రతిష్టపాలవుతోందని, పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు భక్తులు మృతి బాధాకరమన్నారు. ఘాట్ రోడ్డులో ప్రమాదాలు పెరుగుతున్నాయని విమర్శించారు. టీటీడీ గోశాలలో 100 గోవులు చనిపోయాయని, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిజా లు మాట్లాడితే ఆరోపణలు చేయడం సరికాదన్నా రు. నిజాలను కప్పిపుచ్చాలనుకుంటే దాగవన్నారు. మొదట బీఆర్ నాయుడు పొరబాటు జరిగిందని, తర్వాత అటువంటిది లేదని రెండు నాలుకల ధోరణిలో మాట్లాడడం తగదన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు కు అధికార పార్టీ మద్దతు పలికిందని, రాబోయే రోజుల్లో చర్చిలను కూడా కై వసం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ అధ్యక్షుడు జ్ఞానజగదీష్, నాయకులు రజనీకాంత్, కృష్ణమూర్తి, జయపాల్, కృష్ణరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిజాలు మాట్లాడితే ఆరోపణలు అంటారా..?
విజయానందరెడ్డి