
వరసిద్ధుడి సేవలో సినీ రచయిత
కాణిపాకం వినాయకస్వామివారిని సినీ రచయిత విజయేంద్రప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు.
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి అన్నారు. సోమవారం అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఎండాకాలంలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశాలుంటాయన్నా రు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వా రం రోజుల పాటు క్షేత్రస్థాయిలో అవగాహ న కల్పిస్తామన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఏటా ప్రభుత్వం అగ్నిమాపక వారో త్సవాలను నిర్వహిస్తోందన్నారు. అనంత రం గుడిపాల మండలం పశుమంద గ్రా మంలో ఉన్న కంపెనీలో అవగాహన కార్య క్రమం నిర్వహించారు. అగ్నిమాపక సేవలందిస్తూ మృతి చెందిన పలువురు సిబ్బందికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ అగ్నిమాపక శాఖ అధికారి కరుణాకర్, లీడింగ్ ఫైర్ మెన్‌లు శోభభన్, ఏసుపాదం, సిబ్బంది కుశలన్, గిరిబాబు, రాజు, నవీన్, రాజేంద్ర పాల్గొన్నారు.
– 8లో