అంబేడ్కరంటే చిన్నచూపెందుకు?
అంబేడ్కర్ జయంతి వేడుకలకు కూటమి నేత లు గైర్హాజరుకావడంతో ఆయనంటే చిన్నచూపెందుకన్న విమర్శలొచ్చాయి.
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
చిత్తూరు అర్బన్: పోలీస్.. అర్ధరాత్రి వేళ వీధుల్లో గస్తీ కాస్తూ ప్రజల మానప్రాణాలను కాపాడే రియల్ హీరో. రోడ్లపై దుమ్ము, ధూళిలో నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చేసే ఓ సంఘ సేవకుడు. సమాజం కోసం తిండి తిప్పలు లేకుండా 24 గంటల్లో ఏ క్షణమైనా అధికారులు పిలిస్తే ఇట్టే వాలిపోయే ఓ సూపర్ మ్యాన్. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతిరూపాలైన మూడు సింహాల్లో.. కనిపించని నాలుగో సింహమే పోలీస్. అలాంటి నాలుగో సింహం పరిస్థితి ప్రస్తుతం బాలేదు. ఒత్తిళ్ల మధ్య నలిగిపోతోంది. కనీసం వారంలో ఒక్క రోజంటే ఒక్కరోజు.. సెలవు అడిగితే ఇచ్చే దిక్కులేదు.
నాటి చరిత్ర ఇదీ..
పోలీసులంటే క్రమశిక్షణకు మారుపేరు. స్టేషన్‌లో పనిచేసే పైఅధికారి ఏం చెబితే అది చేయాలి. నోరెత్తి ఎందుకు..? అని అడిగితే అంతే సంగతులు. ఇక నెలకు ఓ రోజు సెలవు కావాలని చిట్టీ రాసుకెళితే, అగ్గిమీద గుగ్గిలమై అధికారులు భగ్గుమనే వాళ్లు. అలాంటి పోలీసులశాఖలో గత వైఎస్సార్ సీపీ సర్కారు ‘వీక్‌ఆఫ్’ (వారాంతపు సెలవు) తీసుకొచ్చి, ఖాకీల పాలిట అండగా నిలిచింది. పోలీసుల సాధకబాధలను ఆలకించి తీసుకున్న వీక్ ఆఫ్ నిర్ణయం ఆ శాఖలో ఓ సరికొత్త సంచలనం నమోదు చేసింది. అసలు పోలీసులకూ ఓ కుటుంబం ఉందని, వారితో వారంలో ఒక్కరోజైనా గడపాలని వారాంతపు సెలవులను తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది. పని ఒత్తిడి కారణంగా ఏ ఒక్కరినీ బలి కోరకూడదని భావించి, ఎందరో పోలీసుల పని ఒత్తిడిని అర్థం చేసుకుని, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన వీక్లీ–ఆఫ్ సంస్కరణ జిల్లాలోని కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు ప్రతిఒక్క పోలీసు అధికారి ఉపయోగించుకున్నవారే.
ఆ చరిత్ర నేడు కనుమరుగు..
ప్రస్తుతం జిల్లా పోలీసుశాఖలో వీక్ ఆఫ్ పేరును ఖాకీలు దాదాపు మరిచిపోయారు. నిత్యం పనిలో ఒడిదుడుకులు, అధికారుల అరుపులు, క్షణం తీరిక లేని పరుగులతో సగటు పోలీసన్న బిజీ అయిపోయాడు. ఇలాంటి తరుణంలో కుటుంబంతో కలిసి వారంలో ఓ రోజు గడిపే పరిస్థితి కనుమరుగైంది. ఇటీవల జిల్లాలో జరిగిన పోలీసు సిబ్బంది బదిలీల్లో చిత్తూరు నుంచి రొంపిచెర్ల, సదుం, పుంగనూరు, సోమల లాంటి పోలీసుస్టేషన్లకు పదుల సంఖ్యలో సిబ్బంది బదిలీ అయ్యారు. భార్యాబిడ్డలు చిత్తూరులో.. కుటుంబ పెద్ద పుంగనూరు నియోజకవర్గంలో విధులు. వారంలో ఓ రోజు భార్య, బిడ్డల్ని చూద్దామని సెలవు అడిగితే, ఆ మాటను వినిపించుకునే నాథుడే లేరు.
సెలవుపై డీఎఫ్‌ఓ
చిత్తూరు కార్పొరేషన్: డీఎఫ్‌ఓ భరణి వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లారు. ఆమె ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పా టు సెలవు పెట్టారు. అంత వరకు ఇన్‌చార్జిగా తిరుపతి డీఎఫ్‌ఓ వివేక్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీసీఎఫ్ యశోదబాయి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ జీఈఏ ఐక్యవేదిక కోచైర్మన్‌గా బాలాజీ
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయ కా ర్మిక పెన్షనర్ల ఐక్యవేదిక (ఏపీ జీఈఏ ఐక్యవేదిక) కోచైర్మన్‌గా శవన్న గారి బాలాజీ ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. ఈయన ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 13 న విజయవాడలోని విద్యాధరపురంలో ఏపీ జీఈఏ చైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షన ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఉపా ధ్యాయ సంఘంలో మండల స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం బాలజీ సే వలందిస్తున్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయనకు ఏపీ జీఈఏ కోచైర్మన్‌గా అదనపు బాధ్యతలను అ ప్ప జెప్పారు. ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కల్పించిన నూతన బాధ్యతలను కర్తవ్యంతో నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని తెలిపారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.
రాజ్యాంగ నిర్మాతకు నివాళి
చిత్తూరు అర్బన్: భాతర రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని నగరంలోని జిల్లా ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే తీవ్ర సామాజిక వివక్షను ఎదుర్కొన్న అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాతగా మారినతీరు నేటి యువతరానికి ఆదర్శమన్నారు. ఆయన సూక్తు లు ప్రజల్ని ధర్మం, న్యాయం వైపు నడిచేలా చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, ఎస్‌బీ సీఐ భాస్కర్, చంద్రశేఖర్, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వెదురుకుప్పం: చిత్తూరు జిల్లాలో పలు చోట్ల సోమవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. వెదురుకుప్పం మండలంలోని ఎగువ కనికాపురంలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్లపై పడడంతో పాక్షికంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కనికాపురం, ముఠాలం గ్రామాల్లో అకాల వర్షంతో వరి పంట నేల కొరిగి నష్టాల పాలైనట్లు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలులకు పంటలు ధ్వంసమయ్యాయి. మండలంలో కొన్ని గ్రా మాల్లో వడగండ్ల వానకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు.
నేలరాలిన మామిడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని పలు పంచాయతీల్లో ఆదివారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం, ఈదురుగాలులకు మామిడి కాయలు నేల రాలాయి. ఉరుములతో కూడిన వర్షం రావడంతో ఎండ తాపం నుంచి కొంత ఉపసమనం కలిగినా, కొన్ని చోట్ల మామిడి పంటకు నష్టం వాటిల్లింది.
నేలకొరిగిన వరి
తవణంపల్లె: మండలంలో ఆదివారం రాత్రి పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగాలులకు వరి పంట నేలకొరిగింది. మండలంలో 475 ఎకరా ల్లో వరి పంట వివిధ దశలో సాగులో ఉంది. ఈ దశలో అకాల వర్షంతో రైతులు న ష్టపోతున్నారు. వర్షానికి, పెనుగాలులకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
జిల్లాలో పోలీసుశాఖ బలగం
హోదా పోస్టు
ఎస్పీ: 1
ఏఎస్పీ: 1
డీఎస్పీలు: 6
సీఐలు: 30
ఎస్‌ఐలు: 41
ఏఎస్‌ఐలు: 103
హెడ్‌కానిస్టేబుళ్లు: 250
కానిస్టేబుళ్లు: 627
ఆర్ముడు రిజర్వు: 360
మినిస్టీరియల్ స్టాఫ్: 35
సెలవు కరువు
పోలీసుశాఖలో కానరాని వారాంతపు సెలవు
సెలవు అడిగితే..అధికారుల కన్నెర్ర
ఖాకీలకు వీక్లీ ఆఫ్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవే
మానసిక వేదనలో పోలీసులు
పోలీస్ ఉద్యోగం.. కత్తి మీద సాములాంటిది. విధి నిర్వహణలో పనిభారం.. కేసుల దర్యాప్తునకు ఉరుకులు, పరుగులు.. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వేధింపులు.. రాజకీయ నేతల జోక్యం.. అనధికార బదిలీలు.. చార్జ్ మెమోలు.. వీటన్నింటికీ తోడు కుటుంబాలకు దూరం కావడంతో నాలుగో సింహం నలిగిపోతోంది. గతంలో ఉన్న వీక్ ఆఫ్ కరువు కావడంతో మానసిక వేదనకు గురవుతోంది. ఇటీవల జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శంగా నిలుస్తున్నాయి.
‘ఈ చిత్రంలో నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి రాజశేఖర్. చిత్తూరు పోలీసు విభాగంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో పనిచేసేవారు. పెళ్లి చూపులకు వెళ్లేందుకు సెలవు అడిగితే ఉన్నతాధికారులు నిరాకరించారు. సెలవు అడిగిన ప్రతిసారీ ఇతనికి నిరాశే ఎదురయ్యేది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై 2018 ఏప్రిల్ 20న చిత్తూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.’
సం‘క్షామం’..
పోలీసు సిబ్బంది సంక్షేమానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటామని, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పే ఉన్నతాధికారులు వీక్ ఆఫ్‌ను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఇక పోలీసులకు కష్టమొస్తే తామున్నామనే భరోసా ఇవ్వడానికి ఏర్పాటైన పోలీసు సంక్షేమ సంఘం జిల్లాలో ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి. వాళ్ల ఉనికిని కాపాడుకోవడం మాత్రమే యూనియన్ ఉందని తోటి సిబ్బంది బహిరంగంగానే దుమ్మెత్తిపోస్తున్నా.. నోరు మెదపని పరిస్థితి. ఏపక్షంగా జరిగిన బదిలీలను ఆపలేక, అడగలేకపోయిన యూనియన్ నాయకులు.. వారాంతపు సెలవు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడానికి కూడా వెనుకంజ వేయడం విమర్శలకు తావిస్తోంది.
పిడుగుపాటుకు రెండు ఆవుల మృతి
గంగవరం: పిడుగు పాటుకు రెండు పాడి ఆవులు మృతి చెందిన ఘటన మండలంలో సోమవారం జరిగింది. మండలంలోని కీలపల్లి పంచాయతీ జేఆర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు సుబ్రమణ్యం తన పొలంలోని చెట్ల కింద నాలుగు పాడి ఆవులు కట్టి ఉంచాడు. అయితే వర్షం కురుస్తున్న సమయంలో అక్కడ పిడుగు పడి రెండు పాడి ఆవులు ఘటనా స్థలంలోనే మృతి చెందాయి. దాదాపు రూ. 2 లక్షలు విలువ చేసే పశువులు ప్రమాదంలో మరణించడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు.
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం
గాలీవాన బీభత్సం