
రేపు బోయకొండ ఆలయం మూసివేత 7న వేణుగోపాలుని ఆలయం మూసివేత
కాణిపాకం: చంద్రగ్రహణ కారణంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని ఆదివారం రాత్రి మూసివేయనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. గ్రహణం రాత్రి 9.57 నుంచి మరసటి రోజు వేకువజామున 1.26 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఇదే సమయానికి ప్రధాన ఆలయంతో పాటు మణికంఠేశ్వరస్వామి ఆలయం, శ్రీవరదరాజులస్వామి ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, గ్రహణశాంతి, అభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు భక్తుల దర్శన సేవ ప్రారంభమవుతుందన్నారు.