విషాదం: ఆడుకుంటూ సెల్లార్‌లోకి వెళ్లగా.. | Boy Passed Away In Cellar Flood Water In Hyderabad | Sakshi
Sakshi News home page

సెల్లార్‌లోని నీటిలో మునిగి బాలుడు మృతి

Published Wed, Oct 14 2020 5:00 PM | Last Updated on Wed, Oct 14 2020 6:10 PM

Boy Passed Away In Cellar Flood Water In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోని నీటిలో మునిగి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దిల్ సుఖ్‌ నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న కురిసిన భారీ వర్షానికి సాహితీ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు వచ్చి చేరింది. ఈ ఉదయం అజిత్ సాయి అనే 3 సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ఆ నీటిలో పడ్డాడు. చిన్నారి ఎంత సేపటికి పైకి రాకపోగా తండ్రి యుగేంధర్‌ సెల్లార్‌లోకి వెళ్లి చూశాడు. అప్పటికే బాబు నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement