మహిళతో సంబంధం: విద్యార్థి ఆత్మహత్య | College Student Takes Life After Woman Blackmail Over Illicit Affair | Sakshi
Sakshi News home page

మహిళతో సంబంధం: విద్యార్థి ఆత్మహత్య

Published Wed, Dec 30 2020 2:42 PM | Last Updated on Wed, Dec 30 2020 4:56 PM

College Student Takes Life After Woman Blackmail Over Illicit Affair - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : మహిళతో అక్రమ సంబంధం ఓ కాలేజీ స్టూడెంట్‌ ప్రాణం బలితీసుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణెలోని కొయాలి గ్రామానికి చెందిన ఆకాశ్‌ అనే 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్‌కు నెల రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో సంగీత అనే మహిళ పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. తమ అక్రమ సంబంధాన్ని ఆకాశ్‌ తల్లిదండ్రులకు చెబుతానంటూ సంగీత బెదిరించసాగింది. ( భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు)

దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆకాశ్‌ సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆకాశ్‌ మొబైల్‌ ఫోన్‌​ కాల్‌ డేటా ఆధారంగా సంగీత బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement