సాక్షి, హైదరాబాద్ : యూట్యూబ్ వీడియోల స్పూర్తితో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం ముఠాలోని ఆరుగురు సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ‘‘ మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 23 బైకులు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, సీసీటీవీ, డీవీఆర్, 3 మొబైల్ ఫోన్స్, 35 లక్షలు సొత్తు స్వాధీనం చేసుకున్నాం. ( ఊరి చివర తోటలో ఉరి వేసుకుని..)
జగదీష్ మార్కెట్లోని గుడిలో జరిగిన దొంగ తనంతో క్లూ దొరికింది. దర్యాప్తులో భాగంగా దొరికిన క్లూస్ ఆధారంగా ఈ ముఠాను గుర్తించాము. ఆరు నెలల వ్యవధిలో 26 దొంగతనాలు చేశారు. వాజిద్ అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్‌గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ గ్యాంగ్‌లో ఉన్న అబ్దుల్ సమీర్‌పై గతంలో మర్డర్ కేసుతో పాటు ఇతర కేసులు ఉన్నాయి. ఈ కేసులో ఇద్దరు రిసీవర్‌లను కూడా అరెస్ట్ చేశాం’’అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment