![Delhi Police Arrested Serial Sexual Molester FIR Lodged - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/27/serial-molester.jpg.webp?itok=cITdUrMI)
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చిన్నారులపై వరుస వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని ఎట్టకేలకు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ బృందం అరెస్ట్ చేసింది. ఈ వరుస వేధింపులతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. విచారణ సమయంలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కథనం ప్రకారం..
5వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీలోని పహర్‌గంజ్‌కు చెందిన యష్ ( 27)గా గుర్తించారు. నిందితుడు యశ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. నవంబర్ 23న 10 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికను నేరస్థుడు బలవంతంగా అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసులో నేరస్థుడిని విచారించగా, అతనిపై ఇప్పటికే ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పోక్సో చట్టం కింద అనేక కేసులు నమోదైనట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు నేరస్థుడిపై ఐపీసీ సెక్షన్ 363, 354, 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..!
Comments
Please login to add a commentAdd a comment