పెళ్లైన నెలకే వేధింపులతో.. | Extra Dowry Assults Married Woman End Lives Peddapalli | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Jul 24 2020 11:12 AM | Updated on Jul 24 2020 11:12 AM

Extra Dowry Assults Married Woman End Lives Peddapalli - Sakshi

జక్కుల సమత

పెద్దపల్లి,ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన జక్కుల సమత (23) అనే వివాహిత అత్తింటి వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన సమతను నాలుగు నెలల క్రితం వెల్గటూర్‌ మండలం స్థంభంపల్లి గ్రామానికి చెందిన జక్కుల మహేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే పెళ్లైన నెల రోజుల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త మహేష్‌తో పాటు అత్తమామ మల్లవ్వ, చంద్రయ్య, ఆడపడుచు సునీత శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. అంతే కాకుండ మహేశ్‌ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధించేవాడని మృతురాలి సోదరుడు జెల్ల అనిల్‌ తెలిపాడు. అనిల్‌ ఫిర్యాదు మేరకు రామగుండం ఏసీపీ ఉమేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement