బనశంకరి/కర్ణాటక: చలవాదిపాళ్య బీజేపీ మాజీ కార్పొరేటర్ రేఖా కదిరేశ్ హత్యకేసులో మరికొందరిని కాటన్‌పేటే పోలీసులు విచారించనున్నారు. రేఖా సోదరి మాలా, ఆమె కుమారుడు అరుళ్‌తో పాటు ఇప్పటివరకు 7 మందిని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. తన ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళల్లో ఎవరైనా ఒకరు వచ్చే పాలికె ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని మాలా కోరుకుంది. ఇందుకు అడ్డుగా ఉన్న రేఖాను అంతమొందించాలని నిశ్చయించుకుంది. ఇందుకు పీటర్, సూర్య, స్టీఫెన్ సహాయం తీసుకుంది.
రౌడీ అతుశ్‌ను విచారించాలి
స్థానిక రౌడీషీటర్ అతుశ్‌పై అనుమానం ఉందని, అతన్ని విచారించాలని, పోలీస్ కమిషనర్ కమల్‌పంత్‌కు బెంగళూరు దక్షిణ విభాగ బీజేపీ అద్యక్షుడు ఎన్‌ఆర్.రమేశ్ ఫిర్యాదు చేశారు. 2018లో రేఖా భర్త, చలవాదిపాళ్య బీజేపీ కార్పొరేటర్ కదిరేశ్‌ను దుండగులు హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు హత్యల్లో అతుశ్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపించారు.
చదవండి: హత్యకు ఆరు నెలలుగా కుట్ర .. గతంలో భర్త.. ఇప్పుడు భార్య!
Comments
Please login to add a commentAdd a comment