యశవంతపుర: తల్లిదండ్రులనుంచి తనను వేరు చేసేందనే కసితో భార్యను అంతమొందించేందుకు పన్నిన పథకం బెడిసికొట్టి భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అరవింద, ఉదయకుమార్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన చైతన్యను అరవింద్ ఏడాదన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె ఆరు నెలల గర్భిణి. వివాహం అనంతరం చైతన్య వేరు కాపురం పెట్టించింది. తల్లిదండ్రులనుంచి దూరంగా ఉండటంతో అరవింద్ మనోవేదనకు గురయ్యాడు. దీంతో చైతన్యనుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించగా ఆమె అంగీకరించలేదు.
దీంతో చైతన్యను హత్య చేయాలని ప్లాన్ వేసి పాత టాటాసుమోను కోనుగోలు చేసి ఉదయకుమార్ అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. చైతన్యను యాక్సిడెంట్ ద్వారా హత్య చేయాలని సుఫారీ ఇచ్చాడు. సీసీ కెమెరాలులేని స్థలాన్ని గుర్తించి అక్కడ యాక్సిడెంట్ చేయాలని ఉదయకుమార్‌కు సూచించాడు. వారం రోజుల క్రితం భరతనాట్యం ముగించుకొని బాగలూరు కెఐడీబి లేఔట్ సమీపంలో స్కూటీతో వెళ్తున్న చైతన్యను సుమోతో ఢీకొన్నారు.
స్వల్పంగా గాయపడిన ఆమె బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కేమరాలను పరిశీలించగా అనవాళ్లు దొరకలేదు. అదే మార్గంలో పాత టాటా సుమో తిరిగిన అనవాళ్లను గుర్తించి ఆ వాహనం ఎవరిదనే వివరాలు సేకరించి ఉదయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుట్ర వెలుగు చూసింది. దీంతో ఉదయ్‌కుమార్, అరవిందను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment