
సాక్షి, హిమాయత్‌నగర్: వాట్సాప్‌లో పరిచయమైన అమ్మాయి మాటలు నమ్మిన ఓ యువకుడు రూ.లక్షల్లో మోసపోయి పోలీసులకు ఆశ్రయించాడు. ఓల్డ్ మలక్ పేటకు చెందిన ఓ యువకుడికి ఇటీవల ఓ యువతి వాట్సాప్‌లో పరిచయమైంది. కొన్ని రోజులు మాట్లాడుకుని ఒకరికొకరు ఇష్టపడ్డారు. తాను యాప్స్‌లలో పెట్టుబడులు పెట్టి లక్షలు సంపాదిస్తున్నానని నువ్వు కూడా పెట్టుబడులు పెట్టాలని కోరింది. ‘బీపీఎం 2021’ అనే యాప్‌లో ముందుగా రూ.50 వేలు పెట్టగా రూ.30 వేలు, రూ.2 లక్షలు పెట్టించి రూ.80 వేలు లాభాలు వచ్చేలా చేసింది. ఆ తర్వాత రూ.7 లక్షలు పెట్టించి లాభాలు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment