సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్ట్రాగామ్‌లోని యాడ్స్ డిగ్రీ చదువుతున్న ఆమెను ఆకర్షించింది. రూ.100 పెడితే రూ.200 వస్తాయన్న ప్రచారంతో ముందు కొద్దిగా డబ్బులు కట్టింది. మొదటగా వారు కొద్ది కొద్దిగా లాభాలు ఇచ్చి బుట్టలో పడేశారు. దీంతో ఆమె ఇంట్లోని తండ్రికి చెప్తే..ఆయన కూడా ప్రోత్సహించాడు. ఇంకేముంది కట్ చేస్తే తాము ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు లాభాలు ఇవ్వట్లేదని..చేసిన డబ్బు ఇవ్వట్లేదంటూ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు మల్లేపల్లికి చెందిన తండ్రీ, కూతుర్లు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ యువతి ఇటీవల ఓ యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. పలు దఫాలుగా రూ.12లక్షలు కట్టింది. వాటికి లాభాలు ఇవ్వకపోగా ఆ డబ్బును కూడా బ్లాక్ చేశారు. దీంతో సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు తెలిపారు.
చదవండి: గొంతుకు చున్నీ బిగించి..
రెండో వివాహం పేరుతో రూ.10 లక్షలు స్వాహా..
ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో నగరానికి చెందిన మహిళకు లండన్‌లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఎక్కువ రోజులు ఉండలేనని రెండు రోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తా..ఢిల్లీ మీదుగా వచ్చేప్పుడు మనం కలసి బతికేందుకు పెద్ద ఎత్తున డబ్బు కూడా తెస్తున్నా అన్నాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్ కాల్స్ చేసి ఆ మహిళ నుంచి రూ.10లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మధు చెప్పారు.
చదవండి:ఇమ్రాన్‌ఖాన్‌ను ఆధారాలు కోరవచ్చు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఎస్‌బీఐ కేవైసీ అప్‌డేట్ అంటూ రూ.6లక్షల 40వేలు మాయం..
ఎస్‌బీఐ కైవైసీ అప్‌డేట్ చేసుకోమంటూ తార్నాకు చెందిన ఓ వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు వల వేశారు. బ్యాంకు వివరాలను సేకరించి ఆయన ఖాతా నుంచి రూ.6లక్షల 40వేలు కాజేశారు.
Comments
Please login to add a commentAdd a comment