J&K: ఘోర ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి | 36 Killed And 19 Injured After Bus Falls Into Gorge In Jammu Kashmir Doda District - Sakshi
Sakshi News home page

Jammu Kashmir Bus Accident: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 36 మంది మృతి

Published Wed, Nov 15 2023 2:11 PM | Last Updated on Wed, Nov 15 2023 9:23 PM

Jammu Kashmir Assar region of Doda bus accident Updates - Sakshi

శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దోడా ప్రాంతంలో అస్సార్‌ వద్ద ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. 19 మందికి గాయాలైనట్లు సమాచారం.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. క్షతగాత్రుల్ని కిష్తావర్‌, దోడా సీఎంసీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించింది. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

బుధవారం బటోటే-కిష్తావర్‌ జాతీయ రహదారిపై బత్రుంగల్‌-అస్సార్‌ వద్ద బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతున పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్ము డివిజనల్‌ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడించారు. 

ప్రధాని దిగ్భ్రాంతి.. 
దోడా ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ప్రధాని.. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి  మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.​

మరోవైపు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించిన ఆయన.. అవసరమైతే హెలికాఫ్టర్‌ సేవల్ని వినియోగించాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement