
సంధ్య, కదిరివేల్ (ఫైల్)
సాక్షి, చెన్నై: రాణిపేట జిల్లా అమ్మూరు సమీపంలోని వేలంపుదూరు గ్రామానికి చెందిన సుబ్రమణి కుమార్తె సంధ్య (18) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఫ్లస్‌టూ చదువుతోంది. ఈమె పక్క ఇంటికి చెందిన కాశి కుమారుడు కదిర్‌వేల్(24)ను ప్రేమించింది. ఈక్రమంలో సంధ్యను వివాహం చేసుకునేందుకు కదిర్‌వేల్ కుటుంబ సభ్యులతో కలిసి గతవారం సంధ్య ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.
చదవండి: జగత్ కిలాడీలకు ఝలక్
అయితే సంధ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో మనోవేదనకు గురైన సంధ్య బుధవారం సాయంత్రం ఇంటి వెనుక వైపున ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు మృతితో కదిర్‌వేల్ ఆవేదనకు గురై.. షోళింగర్ సమీపంలోని నరసింహపురం వద్ద అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. షోళింగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment