
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం వద్ద గోదావరిలో దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. గల్లంతైనవారు గోపాలపురం మండలం గుడ్డిగూడేనికి చెందిన సత్యనారాయణ, కుమార్తె మానస, కుమారుడు కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం భార్య పోచమ్మ మృతితో మనస్తాపం చెందిన సత్యనారాయణ.. ఇద్దరు పిల్లలతోపాటు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. గోదావరిలో ఇప్పటివరకు తండ్రి, పిల్లల మృతదేహాలు లభ్యంకాలేదు. జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment