ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఆదిలాబాద్: ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒక్కరు దారుణ హత్యకు గురయిన సంఘటన ఇచ్చోడ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలంలోని పోన్న గ్రామనికి చెందిన బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను (35) ఆదే మండలంలోని సుంకిడి గ్రామానికి చేందిన జాదవ్ శ్రీనివాస్ దారుణంగా హత్య చేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలో మీషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద హత్య చేసి మహారాష్టలోని మండివి అటవీ ప్రాంతంలో ఎవరికి అనుమానం రాకుండా వాహనంలో జ్ఞానేశ్వర్ శవాన్ని పడేశారు. మూడు రోజులు నుంచి హత్యకు గురయిన జ్ఞానేశ్వర్ కనపడకుండా పోవడతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు, సమీప బంధువుల ఇళ్లలో ఆరా తీసినా ఎక్కడ ఆచూకీ తెలవక పోవడంతో ఆదివారం ఉదయం ఇచ్చోడ, సిరికొండ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఇచ్చోడ సీఐ కంప రవీందర్ బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వారి వివారాల ప్రకారం అనుమానితులను ఆదుపులోకి తీసుకుని విచారించారు. జాదవ్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను తానే హత్య చేసి శవాన్ని మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఆదివారం సాయంత్రం సీఐ కంప రవీందర్, ఇచ్చోడ ఎస్సై సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి నేరస్తుడిని తీసుకెళ్లి శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని మండివి అటవీ ప్రాంతలో నుంచి శవాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్ అస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్, ఎస్సై సుర్యప్రకాశ్ తెలిపారు.
స్నేహితుడే హత్య చేశాడు
బగ్నూరే జ్ఞానేశ్వర్, జాదవ్ శ్రీనివాస్ ఇద్దరు మంచి స్నేహితులు, గత సంవత్సరం కిత్రం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో సిరికొండ జెడ్పీటీసీగా జాదవ్ శ్రీనివాస్, పోన్న ఎంపీటీసీగా బగ్నూరే జ్ఞానేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికలలో ఇద్దరు పోటీ చేసి ఓడి పోయిన మంచి స్నేహితులుగా అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ఎన్నికలలో ఓటమి అనంతరం జాదవ్ శ్రీనివాస్ ఇచ్చోడలో మీసేవ కేంద్రం నడుపుతున్నాడు.జ్ఞానేశ్వర్ పోన్నలో నివాసముంటున్నా తరుచూ ఇద్దరు కలుసుకుంటారు. గత మూడు రోజుల కిత్రం ఇద్దరు కలిసి ఇచ్చోడ మండల కేంద్రంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ వెళ్లే దారిలో మద్యం సేవించారు. మృతుడు జ్ఞానేశ్వర్‌కు పెళ్లి అయిన 8 సంవత్సరాలు కావస్తున్న ఇంకా పిల్లలు కాలేదు. నీ లోపం వల్లె నీకు పిల్లలు కావడం లేదని జాదవ్ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్‌ను రెచ్చ గొట్టాడు. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ తలపై బండరాయితో బలంగా బాదడంతో జ్ఞానేశ్వర్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఎవరికి అనుమానం రాకుండా తన కారులో జ్ఞానేశ్వర్ శవాన్ని మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని మండివి వద్ద పడేసి తనకు ఏమి తెలియనట్లుగా ఉన్నాడు. మృతిని బంధువులు ఇచి్చన ఫిర్యాదు మేరకు సీఐ రవీందర్ అనుమానాస్పద వ్యక్తులను విచారించి అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయట పడ్డాయి. ఈ మేరకు నిందితుడిని ఆదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment