ప్రేయసి బామ్మ, తమ్ముడిని చంపి.. ఆపై | Man Met Girlfriend On Instagram Eliminates Her Family Nagpur | Sakshi
Sakshi News home page

ప్రేయసి బామ్మ, తమ్ముడిని చంపి.. దారుణం

Published Fri, Dec 11 2020 4:45 PM | Last Updated on Fri, Dec 11 2020 4:52 PM

Man Met Girlfriend On Instagram Eliminates Her Family Nagpur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమికురాలి తమ్ముడు, బామ్మను పాశవికంగా హతమార్చాడో యువకుడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. నాగ్‌పూర్‌లోని మోమిన్‌పురాకు చెందిన మొయిన్‌ ఖాన్‌(22)కు గతేడాది నవంబరులో గుంజన్‌ అనే అమ్మాయితో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్నేహం చిగురించింది. తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. మొయిన్‌ను తన స్నేహితుడిగా గుంజన్‌ తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

ఈ విషయం తెలుసుకున్న గుంజన్‌ కుటుంబం మొయిన్‌ ఖాన్‌ను హెచ్చరించింది. ఆమెకు దూరంగా ఉండాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చింది. అంతేగాకుండా గుంజన్‌ను తమ బంధువుల ఇంటికి పంపేశారు. దీంతో ఆవేదన చెందిన మొయిన్‌ ఖాన్‌ గురువారం మధ్యాహ్నం ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో గుంజన్‌ తమ్ముడు(10), బామ్మ ప్రమీలా మారుతీ ధర్వే(70) ఇంట్లో ఉన్నారు. గుంజన్‌ గురించి విరాలు చెప్పేందుకు వారు నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరినీ పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. (చదవండి: హేమనాథ్‌ చిత్రను కొట్టి చంపేశాడు..)

ఇక అదే రోజు రాత్రి మంకాపూర్‌ ఏరియా రైల్వేట్రాక్‌ వద్ద మొయిన్‌ ఖాన్‌ శవమై కనిపించాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంజన్‌ కుటుంబ సభ్యులను చంపిన అనంతరం రైలుకు ఎదురువెళ్లి మొయిన్‌ ఖాన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమ వ్యవహారమే ఈ దారుణాలకు దారి తీసినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement