
నిర్వాహకులతో పాటు మహిళ అరెస్ట్
వెంగళరావునగర్: వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రహమత్‌నగర్‌లోని ఓ గృహంలో వ్యభిచారం జరుగుతున్నట్టుగా మధురానగర్ పీఎస్‌కు సమాచారం వచ్చింది.
దీంతో ఎస్‌ఐ అవినాష్ తన సిబ్బందితో వెళ్ళి దాడి చేశారు. అక్కడ నిర్వాహకులు వంశీ, అతని భార్య ఉన్నారు. వారితో పాటుగా వైజాగ్‌కు చెందిన మహిళ కూడా ఉంది. నిర్వాహకులను పోలీసులు ప్రశ్నించగా వైజాగ్‌కు చెందిన మహిళతో వ్యభిచారం చేయిస్తున్నట్టుగా అంగీకరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న కండోమ్స్, ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఈ మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment