విజయవాడ: వరుసగా దోపిడీలకు పాల్పడుతూ ప్రజల్ని హడలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన చోరీలతో ఆ ఇద్దరికి సంబంధం ఉందా అనే కోణంలో విచారణ సాగుతున్న తెలుస్తోంది. తమ అదుపులో ఉన్న వారిని విచారించి మిగిలిన ముఠాను పట్టుకునే పనిలో విజయవాడ పోలీసులు నిమగ్నమయ్యారు.
కాగా చెడ్డీ గ్యాంగ్ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. గతంలో జరిగిన నేరాలు దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా నుంచి వచ్చినట్టుగా విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా ధ్రువీకరించుకున్నారు. వీరు నేరాలకు నగరానికి దూరంగా ఉన్న ఇళ్లనే ఎంపిక చేస్తారు.
ముఖ్యంగా రైల్వేట్రాకుల వెంబడి ఉన్న ఇళ్లు, జాతీయ రహదారికి దగ్గరగా ఒంటరిగా ఉన్న బంగ్లాలు, భవనాలు, అపార్టుమెంట్లు వీరు తమ దొంగతనాలకు అనుకూలంగా భావిస్తారు. నిమిషాల వ్యవధిలోనే నేరం చేసి అక్కడ నుంచి సులువుగా బయటకు వచ్చి రైల్వే ట్రాకు వద్దకు చేరుకుని వేగంగా వెళుతున్న రైలును కూడా వీరు సులువుగా ఎక్కి పరారౌతారు. జాతీయ రహదారికి సమీపంలోని ఇళ్లలో నేరాలు చేసి క్షణాల్లో జాతీయ రహదారిపైకి చేరుకుని లారీలపై పరారౌతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment