మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
యాదమరి: చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండపల్లె సమీపంలోని శ్రీ రామతీర్థం ఆశ్రమ నిర్వాహకుడు సచ్చిదానంద స్వామి మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి స్వామిని ఉరివేసి చంపేశాడని సేవకురాలు లక్ష్మమ్మ చెప్పడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
మృతుని సోదరుడు శ్రీరాములురెడ్డి మాట్లాడుతూ.. సచ్చిదానందస్వామి అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసేందుకు మిట్టూరులో ఓ భవనాన్ని కొనుగోలు చేశారని.. సంవత్సరాలు గడచినా ఆ భవనంలో ఉన్నవారు ఇంటిని ఖాళీ చేయకపోవడంతో పలుమార్లు వారిని స్వామీజీ సంప్రదించారని చెప్పారు. వారే హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment