కిరాతక మేనల్లుడు.. అత్తమామల దారుణహత్య   | Tamil Nadu Krishnagiri Nephew Massacre of In Laws | Sakshi
Sakshi News home page

కిరాతక మేనల్లుడు.. అత్తమామల దారుణహత్య  

Published Fri, May 7 2021 3:35 PM | Last Updated on Fri, May 7 2021 3:41 PM

Tamil Nadu Krishnagiri Nephew Massacre of In Laws - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

క్రిష్ణగిరి: ఆస్తి తగాదాల్లో మేనల్లుడు అత్తమామలను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. జిల్లా కేంద్రం క్రిష్ణగిరి వీరప్పన్‌నగర్‌కు చెందిన పుగళేంది(55), భార్య పప్పిరాణి (45). పుగళేందికి అన్న ఇళంగోవన్‌తో ఆస్తి గొడవలున్నాయి. ఇళంగోవన్‌ కొడుకు లోకేష్‌ (18) హోసూరులో డిగ్రీ రెండవ ఏడాది విద్యార్థి. గురువారం ఉదయం మిత్రుడు సతీష్‌(18)తో కలిసి అత్త ఇంటికి వెళ్లి వేటకొడవలితో దాడి చేశారు.

ఈ దాడిలో భార్యాభర్తలిరువురూ తీవ్ర గాయాలతో ప్రాణాలు విడిచారు. క్రిష్ణగిరి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాలను స్వాధీనపరుచుకొన్నారు. కేసు నమోదు చేసుకొని లోకేష్, సతీష్‌లను అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో తీవ్ర సంచలనం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement