సాక్షి, చెన్నై: బైక్ దొంగతనం నెపంతో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. అతడిని కర్రలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ పైశాచికత్వం ప్రదర్శించారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. కరూర్ ప్రాంతంలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న అనిష్(22)ను కొందరు వ్యక్తులు కలిశారు. తమ బైకును అనిష్ దొంగిలించాడనే అనుమానంతో అతడితో మాట‍్లాడాలని వారు చెప్పారు. అనంతరం కరూర్ జిల్లాలో వీరరక్కియంలోని నిర్మానుష్య ప్రాంతానికి అనిష్‌కు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో అనిష్‌ను వారు బెదిరిస్తూ.. బైకు దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని బెదిరించారు. ఇందుకు అనిష్ ఒప్పుకోకపోవడంతో 10 మంది అతడిపై దాడి చేశారు. కర్రలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ, పిడి గుద్దులతో చితకబాదారు. వారిలో ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీశాడు. వారి దాడి చేస్తున్న సమయంలో అనిష్ అరుస్తూ.. తనను పోలీస్ స్టేషన్‌కు తరలించాలని వేడుకున్నాడు.
కానీ, వారు అదేమీ పట్టించుకోకుండా దాడి చేశారు. అనంతరం అనిష్‌ను అతడి ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన తన కొడుకును చూసి అనిష్ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment