
పని చూసుకొమ్మని తల్లి ఒత్తిడి.. దాంతో కూతురు
గోవిందరావుపేట: ఏ పనిచేయడం లేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. గోవిందరావుపేట మండలంలోఈ సంఘటన చేసుకుంది. కాగా, ఇప్పలగడ్డకు చెందిన ఎట్టి సుస్మిత ఇంటి వద్దే ఉంటుంది. కాగా, కొన్ని రోజులుగా ఆమె తీరును గమనించిన తల్లి ఏదైన పని చూసుకొమ్మని తల్లి కొంత ఒత్తిడి తెచ్చింది. అయినప్పటికి తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల తీవ్రస్థాయిలో మందలించింది.
దీంతో మనస్తాపానికి గురైన ఆమె శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం పాల్పడింది.వెంటనే ఆమె కుటుంబ సభ్యులు బాలికను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పురుగుల మందు ప్రభావంతో సుస్మిత మరణించిందని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పస్రా ఎస్సై రవీందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment