
బుకారెస్ట్ : కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన ఘటన రొమేనియా దేశంలో చోటు చేసుకుంది. పియాట్రా నీమ్ట్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ వార్డ్‌లో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రోగులలందరిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శనివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన వారంతా ఆస్పత్రి రోగులేనని అధికారులు స్పష్టం చేశారు.