బోనాల్‌ వెళ్లే దారి ఇదేనా? మాటల్లోకి దించి చోరి.. | Thieves Snatches Gold Chain From Women In Medak | Sakshi

దారి అడిగారు.. దోచుకుపోయారు!

Mar 18 2021 10:32 AM | Updated on Mar 18 2021 10:36 AM

Thieves Snatches Gold Chain From Women In Medak - Sakshi

సీసీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యం  

సాక్షి, తూప్రాన్(మెదక్‌): స్కూటీపై వచ్చి దారి అడిగి మహిళ మెడలోచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన ఇబ్రహీంపూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మఠం అనిత వ్యవసాయ పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తుంది. ఈ క్రమంలో చేగుంట నుంచి బోనాల్‌ వైపు స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనితను ఆపి బోనాల్‌ వెళ్లే దారి ఇదేనా అని ప్రశ్నించారు. ఆమె సమాధానం చెబుతుండగానే మెడలోంచి నాలుగు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఏడుస్తూ గ్రామంలోకి వచ్చి విషయం తెలపగా గ్రామ యువకులు రుక్మాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. చేగుంట వైపు నుంచి వస్తున్న స్కూటీ సీసీ కెమెరాలో రికార్డు కాగా దాని ఆధారంగా చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement