వలస వెళ్లి.. ఏం జరిగిందో గానీ రైల్వే ట్రాక్‌పై.. | Two Men Died At Road Accident Srikakulam | Sakshi
Sakshi News home page

వలస వెళ్లి.. ఏం జరిగిందో గానీ రైల్వే ట్రాక్‌పై..

Published Sun, Mar 20 2022 8:06 AM | Last Updated on Sun, Mar 20 2022 8:39 AM

Two Men Died At Road Accident Srikakulam - Sakshi

సాక్షి,భామిని(శ్రీకాకుళం): మండలంలోని ఘనసర కాలనీకి చెందిన యువకుడు చెంగల మణికంఠ(26) శనివారం హైదరాబాద్‌లో మృతి చెందాడు. పదో తరగతి వరకు చదివిన మణికంఠ హైదరాబాద్‌లో ఉంటున్న సోదరుడు చెంగల శివ ఇంటికి ఏడేళ్ల క్రితం వెళ్లి చిరుద్యోగం చేసుకుంటున్నాడు. ఇంకా వివాహం కాలేదు. ఏం జరిగిందో గానీ హైదరాబాద్‌లోని చర్లపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శనివారం మణికంఠ శవమై కనిపించాడు.

ఆర్థిక సమస్యలు, ఇతర ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బంధువులు భావిస్తున్నారు. కుమారుడి మరణవవార్త విని ఘనసర కాలనీలో ఉంటున్న తల్లి చెంగల రెయ్యమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. అనంతరం బంధువులతో కలిసి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లింది.  

చెట్టుపై నుంచి జారిపడి.. 
రేగిడి: మండలంలోని ఖండ్యాం గ్రామానికి చెందిన రేగాన రాములు (39) ఆదివారం చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందారు. ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ ఆలీ అందించిన వివరాల ప్రకారం.. జి.సిగడాం మండలం సర్వేశ్వరపురం గ్రామానికి చెందిన రాములు చెట్టు కొడుతూ జీవనం సాగిస్తున్నారు. ఖండ్యాం గ్రామంలో చెట్టును కొట్టేందుకు వచ్చి చెట్టు పైకెక్కి కొమ్మ కొడుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి కిందపడ్డాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, కుమార్తెలు గౌతమి, హాసినిలు ఉన్నారు. మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.  (చదవండి: భార్యపై అనుమానం..చివరకు ఎంతపని చేశాడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement