
సాక్షి, నెల్లూరు: జిల్లాలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మొదట నిందితుడు భార్యను హత్య చేశాడు. అనంతరం భార్యకు అక్రమ సంబంధంలో సహకరిస్తోందన్న అనుమానంతో మరో మహిళను అత్యంత పాశవికంగా నరికి చంపాడు. ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధిలోని నాలుగో మైలులో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. నెల్లూరు రూరల్ పరిధిలో నివసించే నాగేశ్వర్‌రావు అనే వ్యక్తి భార్య నిర్మలమ్మతో పాటు, వెంకట రమణమ్మ అనే మరో మహిళను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం నాగేశ్వర్‌రావు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు భావిస్తున్నారు. వరుస హత్యలపై సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. (పరిటాల అనుచరుడి భూదందా.. అజ్ఞాత వ్యక్తి లేఖతో)
Comments
Please login to add a commentAdd a comment