టెన్త్‌ క్లాస్‌ వాట్సాప్‌ గ్రూపులో బూతు వీడియోలు | Vulgar Videos Found In 10th Class Whatsapp Group In UP | Sakshi
Sakshi News home page

టెన్త్‌ క్లాస్‌ వాట్సాప్‌ గ్రూపులో బూతు వీడియోలు

Published Mon, Sep 7 2020 1:07 PM | Last Updated on Mon, Sep 7 2020 3:54 PM

Vulgar Videos Found In 10th Class Whatsapp Group In UP - Sakshi

లక్నో : పదవ తరగతి వాట్సాప్‌ గ్రూపు నిండా బూతు వీడియోలు దర్శనమిచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగపత్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పదవ తరగతి చదివే విద్యార్థి ఇంటర్‌నేషనల్‌ నెంబర్‌తో బయోలజీ వాట్సాప్‌ గ్రూపు క్రియేట్‌ చేశాడు. అందులో బూతు వీడియోలు, బయోలజీ టీచర్‌ ఫొటోలు ఉంచాడు. అంతేకాకుండా గ్రూపు సభ్యులు అసభ్యకరంగా చాట్‌ చేసుకుంటూ ఉన్నారు. దీని గురించి ఓ ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న స్కూల్‌ ప్రిన్సిపల్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి : భైంసాలో విషాదం.. తల్లీ కూతురు ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement