లక్నో: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ ఒకడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు తాజాగా ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు. పలు హత్యా, దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న గుఫ్రాన్‌ను మంగళవారం ఉదయం కౌశంబి జిల్లాలో పోలీసుల చేతిలో హతమయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీం కౌశంబి జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఐదు గంటల సమయంలో గుఫ్రాన్ పోలీసులకు ఎదురయ్యాడు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో రక్షణ కోసం ఎదురు కాల్పులకు దిగగా.. గుఫ్రాన్ శరీరంలోకి పోలీస్ తుటాలు దిగబడ్డాయి.
గాయపడిన గుఫ్రాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. గుఫ్రాన్‌పై మొత్తం 13 కేసులు ఉన్నాయి. ప్రతాప్‌గఢ్‌తో పాటు పలు జిల్లాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. అతని ఆచూకీ కోసం.. లక్ష రూపాయల నజరానా ప్రకటించారు యూపీ పోలీసులు.
2017 నుంచి యూపీలో యోగి పాలనలో ఇప్పటిదాకా 10,900 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. 185 మంది కరడుగట్టిన నేరస్థులు చనిపోయారు.
ఇదీ చదవండి: కండోమ్ ప్యాకెట్‌తో కేసును చేధించిన పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment