![Woman Attacked RTC Bus Driver In Vijayawada - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/02/10/4777.jpg.webp?itok=CvHuZJkw)
డ్రైవర్ ముసలయ్యపై దాడి చేస్తున్న నందిని
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ మహిళ దాడి చేసిన ఘటన నగరంలో బుధవారం కలకలం రేపింది. సూర్యారావుపేట సీఐ జానకి రామయ్య కథనం మేరకు.. విద్యాధరపురం డిపోనకు చెందిన ఐదో నంబర్ రూట్ బస్సు బుధవారం సాయంత్రం కాళేశ్వరరావు మార్కెట్ నుంచి ఆటోనగర్‌కు బయలుదేరింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన కె.నందిని తన ద్విచక్ర వాహనంపై వన్ వేలో రాంగ్‌రూట్‌లో కేఎల్ యూనివర్సిటీ జంక్షన్ వద్ద బస్సుకు అడ్డంగా వచ్చింది. దీంతో డ్రైవర్ ఎం.ముసలయ్య అత్యవసర బ్రేకు వేసి ప్రమాదం జరగకుండా బస్సును అదుపు చేశారు.
చదవండి: కాటేసిన బాబాయ్.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే..
అయితే నందిని ఆగ్రహంతో చంపేస్తావా అంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడి చేసింది. డ్రైవర్‌ను బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో దాడిచేయడాన్ని అక్కడే ఉన్న మరో మహిళ తన ఫోన్‌లో చిత్రీకరించింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీడియో దృశ్యాలను పరిశీలించి, విచారణ చేపట్టిన అనంతరం డ్రైవర్ ముసలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందినిపై కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్‌పై నందిని దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment