
సాక్షి, ధర్మవరం : భర్త మోసం చేశాడన్న మనస్తాపంతో ఓ మహిళ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటన బుధవారం అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన అంజలి(25)కి పురుషోత్తం అనే డ్రైవర్‌తో వివాహమైంది. రెండో వివాహం చేసుకున్న అతడు ఆమెను వదిలేశాడు. ( తల్లి చేతుల్లోంచి పసిబిడ్డ కిడ్నాప్ )
దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం ప్రజలందరి ముందు బ్లేడుతో గొంతు కోసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెను అడ్డగించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ( భార్య ఘాతుకం: భర్త గాఢ నిద్రలో ఉండగా..)
Comments
Please login to add a commentAdd a comment