
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో అల్లుడ్ని హత్య చేసిందో అత్త. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉప్పల్ రామంతపూర్, కేసీఆర్ నగర్‌కు చెందిన నీవన్ అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం అనిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం అనిత తన కూతురు వందనను నవీన్‌కు ఇచ్చి వివాహం చేసింది. నవీన్ వేధింపులు భరించలేక, తల్లి, భర్తల వివాహేతర సంబంధం బయటపడటంతో వందన నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ( వలపు వల.. వేశ్యా వాటికకు పిలిపించి.. )
ఈ కేసులో ఇద్దరూ జైలుపాలయ్యారు. జైలునుంచి విడుదలై బయటకు వచ్చిన ఆ తర్వాత కూడా అనిత, నవీన్‌ల అక్రమ సంబంధం కొనసాగింది. ఈనెల 11నుంచి ఇద్దరూ శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో ఉంటున్నారు. అయితే నవీన్ ప్రతిరోజూ ఆమెను వేధించసాగాడు. దీంతో విసుగుచెందిన ఆమె అతడ్ని చంపాలని నిశ్చయించుకుంది. బుధవారం రాత్రి అతడు నిద్రపోతుండగా కత్తితో నరికి చంపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. నిందితురాలు అనితపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment