Srikanth, the extramarital affair between the owner’s wife - Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం 

Published Fri, Jan 22 2021 7:38 AM | Last Updated on Fri, Jan 22 2021 1:37 PM

Young Man Assassinated Over Illicit Affair In Hosur - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు :  వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులోని హొసూరులో జరిగింది. కృష్ణగిరి జిల్లా హొసూరు బేగిపల్లికి చెందిన హరి కుమారుడు శ్రీకాంత్‌ (21). ఇతను హొసూరు మునేశ్వరనగర్‌లో వున్న బైరోస్‌ అనే వ్యక్తి మాంసం దుకాణంలో పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో శ్రీకాంత్‌కు, యజమాని భార్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి బైరోస్‌ శ్రీకాంత్‌ను మందలించాడు. అయినా సంబంధం కొనసాగిస్తుండడంతో శ్రీకాంత్‌ను హత్య చేసేందుకు నిర్ణయించాడు. ఈ క్రమంలో  బుధవారం శ్రీకాంత్‌ను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement