కాకినాడ లీగల్: మరదలును కర్రతో కొట్టి హత్య చేసిన బావ పొలినాటి శ్రీనివాస్‌కు జీవిత ఖైదు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలోని రామాలయం వీధికి చెందిన పొలినాటి శ్రీనివాస్ ఇంటి పక్కన నివసిస్తున్న తమ్ముడి భార్య పొలినాటి మాధవి ఇంటి ముందు రోడ్డుపై గిన్నెలు కడగడంతో ఇద్దరు మధ్య 2018లో ఘర్షణ వచ్చింది.
దీంతో ఇంటి ముందు గిన్నెలు కడగవద్దని ఎన్నిసార్లు చెప్పినా, వినడం లేదని కోపంతో కర్రతో గిన్నెలు కడుగుతున్న మరదలు మాధవి తల వెనుక భాగంలో బలంగా శ్రీనివాస్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది.
దీనిపై మృతురాలి భర్త సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరింగి పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో పొలినాటి శ్రీనివాస్ పై నేరం రుజువుకావడంతో హత్య చేసినందుకు జీవిత ఖైదు శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment