ఉమా కొప్పేశ్వరుల పరిణయం
కొత్తపేట: పురాణ ప్రసిద్ధి చెందిన పలివెల ఉమా కొప్పేశ్వరస్వామివార్ల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొత్తపేట మండలం పలివెల క్షేత్రం ఒకటి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శివ పార్వతులు ఏకపీఠంపై కొలువైన విషయం తెలిసిందే. దేవదాయ – ధర్మాదాయ శాఖ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దేవస్థానం ఈఓ సోమాల శివ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దానిలో భాగంగా సోమవారం తెల్లవారుజామున ఆలయంలో కల్యాణమూర్తులైన ఉమా కొప్పేశ్వరులను అర్చకులు, వేద పండితులు ప్రాంగణంలోని రాజరాజనరేంద్రుడు నిర్మించిన కల్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. స్థానిక ఆర్‌డీఓ పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్ సతీ సమేతంగా కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయం తరఫున డీఎస్పీ మురళీమోహన్ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. 4.45 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ప్రతీ ఘట్టం కనుల వైకుంఠంగా జరిపింఆరు. అనంతరం భక్తులకు కల్యాణ తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉమా కొప్పేశ్వరుల పరిణయం
Comments
Please login to add a commentAdd a comment