వందలాది ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
అనంత కుండలాల ఫలాన్నిచ్చే కుండలేశ్వరుడు
కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో వెలిసిన పార్వతీ సమేత కుండలేశ్వరుని దర్శనం అనంత కుండాల ఫలం. నూరు గోవులను హత్య చేసిన పాపం నుంచి కుండలేశ్వరుని దర్శిస్తే విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ నదీస్నానం చేయడం వల్ల లక్ష గోవులను దానమిచ్చినంత పుణ్యఫలం దక్కుతోందని భక్తుల నమ్మకం. ఆలయాన్ని ఆనుకుని వృద్ధ గౌతమీ నదీపాయలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు.
● నేడు మహా శివరాత్రి పర్వదినం
● కోనసీమలో ముస్తాబైన శైవక్షేత్రాలు
● పోటెత్తనున్న ద్రాక్షారామ,
కోటిపల్లి, మురమళ్ల, కుండలేశ్వరం,
ముక్తేశ్వరం, పలివెల, కడలి క్షేత్రాలు
– ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు
● కోటిపల్లి, కుండలేశ్వరం
వద్ద పెద్దఎత్తున పుణ్యస్నానాలు
ఏక పీఠంపై శివపార్వతులు కొలువై..
అగస్త్యేశ్వర మహాముని కోరిక మేరకు శివపార్వతులు ఏక పీఠంపై కొలువు దీరిన ఆలయం కొత్తపేట మండలం పలివెల ఉమా కొప్పేశ్వరుడు. పరమశివుని మహా భక్తుడైన పూజారి ప్రాణాలు నిలిపేందుకు శివుడు కొప్పు ధరించిన వైనం మరో విశేషం. అందుకే ఈ క్షేత్రంలో శివలింగానికి ముందు భాగంలో కొప్పు ఉంటుంది. ఈ క్షేత్రంలో మహా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ఇవే కాకుండా జిల్లావ్యాప్తంగా వందలాది సంఖ్యలో ఆలయాలు మహా శివరాత్రి పర్వదినానికి ముస్తాబయ్యాయి. రాజోలు మండలం కడలి కపోతేశ్వరస్వామి, శివకోడు ఉమా కొప్పేశ్వరస్వామి, అంతర్వేది నీలకంఠేశ్వరస్వామి, అంబాజీపేట మండలం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వరస్వామి ఆలయం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, కాట్రేనికోన మండతం బ్రహ్మసమేధ్యం పంచాయతీ మగసానితిప్పలోని కాలభైరవస్వామి ఆలయంలో శివరాత్రి ఘనంగా జరగనుంది. ఆయా ఆలయాలకు వెళ్లేందుకు రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు, పలు డిపోల నుంచి అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. దర్శనాలకు ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ప్రధాన ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భక్తుల రద్దీ లేకుండా చేస్తున్నారు. వీటితో పాటు అయినవిల్లి శ్రీవరసిద్ధి వినాయకస్వామి, అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి, ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి, వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలనూ భక్తులు పెద్దఎత్తున దర్శించుకోనున్నారు. మగసానితిప్ప వెళ్లేందుకు ఐ.పోలవరం మండలం జి.మూలపొలం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప నుంచి ప్రత్యేకంగా బోట్లు నడపనున్నారు. అలాగే ముక్తేశ్వరం–కోటిపల్లి మధ్య కూడా సాధారణ పంట్లతో పాటు, అదనంగా పడవలను నడపనున్నారు.
వందలాది ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
వందలాది ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
వందలాది ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ
Comments
Please login to add a commentAdd a comment