
ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కూటమి అభ్యర్థికి ఓట్లేయాలని
పోలింగ్ కేంద్రాల వద్ద ఎమ్మెల్యే
గిడ్డి, టీడీపీ కన్వీనర్ నామన ప్రచారం
పి.గన్నవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం హైస్కూలు ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ నామన రాంబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, పోలింగ్ కేంద్రాల వద్దే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు ఓట్లేయాలని వారు కోరారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న పట్టభద్రులను ఆపి మరీ వారు ప్రచారం చేశారు. వారిలో కొందరితో ఎమ్మెల్యే గిడ్డి మాట్లాడుతూ.. మీరు సచివాలయం సిబ్బంది కదా, మీరు పేరాబత్తులకు ఓట్లేయాలి అని అన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఎమ్మెల్యేతో పాటు, కూటమి నేతలు పోలింగ్ బూత్‌ల వద్దే ప్రచారం నిర్వహించడాన్ని పలువురు తీవ్రంగా విమర్శించారు. పట్టభద్రులను ఆపి కూటమి నేతలు ఓట్లు అడుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అధికారం అండతో కూటమి నాయకులు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతో జనం విస్తుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment