సరదాగా వెళ్లి... విగతజీవులై
ఫ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి
ఫ పాత ఇంజరం వద్ద ఘటన
ముమ్మిడివరం/ఐ.పోలవరం: బైక్‌పై సరాదాగా వెళ్లిన ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం మండలం బూరుగుపేటకు చెందిన మట్టా ఆకాష్‌రెడ్డి (21), ముమ్మిడివరం టెలిఫోన్ ఎక్ఛ్సేంజ్ వీధికి చెందిన దొమ్మేటి అభినవ్ (17) స్పోర్ట్స్ బైక్‌పై యానాంకు సరాదాగా వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. వీరిని పాత ఇంజరం 216 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాలను ఐ.పోలవరం పోలీసులు ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఘటనా స్థలంలో సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఐ.పోలవరం ఎస్సై మల్లిఖార్జున రెడ్డి తెలిపారు.
ఒక్కగానొక్క కొడుకు..
ఒక్కగానొక్క కొడుకు అభినవ్ మృతితో ఆ తల్లిదండ్రుల రోధన కంటతడి పెట్టించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, ఇక మాకెవరు దిక్కంటూ దొమ్మేటి అచ్యుత వీరవెంకట సత్యనారాయణ, సరోజనీ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో దేవుళ్లకు మొక్కితే 14 ఏళ్లకు కొడుకు పుట్టాడని, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని వారన్నారు. పదో తరగతి వరకూ చదువుకున్న తమ కుమారుడు స్నేహితులతో కలసి వెళ్లి ఇలా విగతజీవుడవుతాడని అనుకోలేదని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు.
చేతికి అందివచ్చి..
మట్టా రాహుల్, సుభాషిణి దంపతులకు పెద్ద కుమారుడు ఆకాష్‌రెడ్డి. ప్రసుత్తం ముమ్మిడివరంలో డిగ్రీ చదువుతున్నాడు. చేతికంది వచ్చిన కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్నేహితులతో సరదాగా తిరిగి వస్తున్నాడనుకున్నామని, ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని అనుకోలేదని ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధించారు.
సరదాగా వెళ్లి... విగతజీవులై
సరదాగా వెళ్లి... విగతజీవులై
Comments
Please login to add a commentAdd a comment