సూపర్‌ సిక్‌ | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ సిక్‌

Published Sat, Mar 1 2025 8:15 AM | Last Updated on Sat, Mar 1 2025 8:39 AM

సూపర్

సూపర్‌ సిక్‌

గోదావరి డెల్టాకూ అరకొరే..

గోదావరి డెల్టా అభివృద్ధి పనులకు కేటాయింపుల విషయంలోనూ ప్రభుత్వం రైతుల అంచనాలను అందుకోలేకపోయింది. గత ఏడాది బడ్జెట్‌లో రూ.70 కోట్లు చూపించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.200 కోట్లు కేటాయించింది. ఐదు జిల్లాల పరిధిలో ఉన్న డెల్టాకు ఈ కేటాయింపులు ఏ మూలకని రైతులు అంటున్నారు. ఒక్క కోనసీమ నుంచే రూ.350 కోట్లకు ప్రతిపాదన పంపించిన విషయం గమనార్హం.

రైతులంటే చిన్నచూపు

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించింది. వ్యవసాయ రంగాన్ని, రైతులను చిన్నచూపు చూసింది. ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని గాలికి వదిలేసింది. ఇవ్వాల్సిన సొమ్ములో సగమే ఇస్తామని చెప్పడం భావ్యం కాదు. అర్హులందరికీ అన్నదాత సుఖీభవ అందించాలి.

– భూపతిరాజు సత్యనారాయణరాజు,

రైతు, గంటి, కొత్తపేట మండలం

‘దీపం’ లబ్ధిలోనూ మోసమే

కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో లబ్ధిదారులను మోసం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల మంది మహిళలకు దీపం పథకంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్లు అందించాల్సి ఉండగా, కేవలం 90 లక్షల మందికే ఇస్తోంది. దీనివల్ల జిల్లాలో మూడు వంతుల్లో ఒక వంతు మహిళలకు లబ్ధి చేకూరదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి సంక్షేమ పథకాలను అన్నివర్గాలకు ఓ టైమ్‌ టేబుల్‌ ప్రకారం అందించారు. సంక్షేమం అంటే అది.

– కొల్లాటి దుర్గాభవానీ, అమలాపురం

మహిళలను నిరాశ పరిచేలా..

మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన హామీకి బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. తల్లికి వందనం ఇప్పటికే ఒక ఏడాది ఇవ్వలేదు. దీపం పథకంలో ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు అని చెప్పి గత ఏడాది ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇచ్చారు. బడ్జెట్లో ఈ పథకాన్ని సగానికి కుదించేస్తున్నారు. అర్హులందరికీ పథకాలు ఇవ్వలేనప్పుడు అమలు చేస్తామని ఎలా చెబుతున్నారు. ఈ బడ్జెట్‌ మహిళలను తీవ్రంగా నిరాశపరిచింది.

– వంగా గిరిజా,

వైఎస్సార్‌ సీపీ మహిళా

విభాగం జిల్లా అధ్యక్షురాలు,

సన్నవిల్లి, ఉప్పలగుప్తం మండలం

సాక్షి, అమలాపురం: ‘‘అన్న మాటకు కట్టుబడడం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం’’ అనేది తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్‌ చూస్తే అది తేటతెల్లమైంది. అందులో కేటాయింపులు పరిశీలిస్తే పేదలు, వారికి అమలు చేసే సంక్షేమ పథకాలు.. రైతులు.. నిరుద్యోగులు.. మహిళల ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని నిరూపించుకుంది. మహిళా శక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణానికి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. ఈ బడ్జెట్‌పై జిల్లాలో అన్నివర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇటు సంక్షేమం లేదు.. అటు అభివృద్ధి లేదని వారు నిట్టూర్పు వదులుతున్నారు.

ప్రధాన పథకాలకు దగాదగా

● మహిళా శక్తి పథకంలో వనితలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పిన చందబ్రాబు ప్రభుత్వం, దానికి ఈ బడ్జెట్‌లో ఎగనామం పెట్టింది. ఈ పథకం ద్వారా జిల్లాలో 6.03 లక్షల మంది లబ్ధి పొందాల్సి ఉంది. నెలకు రూ.90.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,085.40 కోట్లను కోల్పోవాల్సి వచ్చింది.

● ‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’ అంటూ ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులుంటే అందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పినా, భారీగా కోత విధించారు. బడ్జెట్లో రూ.8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించారు. రూ.12 వేల కోట్లకుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం ఉంటుంది. గత ఏడాది ఈ పథకానికి ఎగనామం పెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది సగం కోత విధించింది. దీనివల్ల జిల్లాలో 2.80 లక్షల మందికి కలగాల్సిన లబ్ధిని కూటమి ప్రభుత్వం చాలా మందికి కోత పెట్టినట్టే.

● దీపం పథకానికి భారీగా ఎసరు పెట్టింది. రాష్ట్రంలో 1.55 కోట్ల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లకు గాను రూ. 2,601 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనివల్ల జిల్లాలో 3.90 లక్షల మంది వరకూ ఉండగా, ఇప్పుడు వీరి సంఖ్య 1.95 లక్షలకు తగ్గిపోనుంది.

● డ్వాక్రా మహిళలకు బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాల పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకూ సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్ర భుత్వం కేటాయింపుల్లో చూపించలేకపోయింది.

● అన్నదాత సుఖీభవ పథకానికీ సగమే కేటాయించింది. కేవలం రూ.6300 కోట్లు మాత్రమే ఇచ్చింది. రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి రూ.10,400 కోట్లు అవసరం కాగా రూ.6,300 కోట్లు కేటాయింపులు చేసింది. ఇప్పటికే ఒక ఏడాది ఎగవేసింది. జిల్లాలో 1,45,890 మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.204.24 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఈ ఏడాది ప్రభుత్వం ఇస్తే సుమారు 95 వేల మందికి మాత్రమే లబ్ధి చేకూరనుంది.

● ఉచిత బస్సు హామీని బడ్జెట్‌లో తుస్సు మనిపించింది. ఈ పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీనివల్ల సుమారు తొమ్మిది లక్ష మంది మహిళలను ప్రభుత్వం మోసం చేసినట్టయ్యింది.

కీలక పథకాలకు బడ్జెట్‌లో ఎగనామం

నిధుల కోతపై ప్రజల పెదవివిరుపు

మహిళా శక్తి, నిరుద్యోగ భృతి,

ఉచిత బస్సు మాటేలేదు

అన్నదాత సుఖీభవ,

దీపం పథకాలకు కోత

చేనేతలకు మొండిచెయ్యి

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత కార్మికులకు మొండి చెయ్యి చూపింది. ఎన్నికల ముందు బూటకపు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.24 వేలు నేరుగా లబ్ధిదారులకు అందించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.

–జాన జగదీష్‌ చంద్రగణేష్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు

నిధులు ఏ మాత్రం సరిపోవు

తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించాలి. ప్రతి విద్యార్థికి ఇస్తానన్న రూ.15 వేలు వారి ఖాతాల్లో జమ చేయాలి. గత ఏడాది ఇవ్వాల్సిన నిధులు కూడా అందించాలి. అంతే కాకుండా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ వెంటనే ప్రకటించి, టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి.

– బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ,

వెదురుపాక, రాయవరం మండలం

ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ ఇది

బడ్జెట్‌లో సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధుల కేటాయింపు లేవు. తల్లికి వందనం పథకానికి అరకొర నిధులు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం అర్హులకు లబ్ధి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని తేటతెల్లమవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీసం డీఏ, పీఆర్సీ, ఐఆర్‌లకు నిధులు ఇవ్వలేదు. రైతులు, చేనేత కార్మికులకు ఇలా పలు రంగాలను విస్మరించారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్‌.

– బొమ్మి ఇజ్రాయిల్‌, ఎమ్మెల్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
సూపర్‌ సిక్‌1
1/7

సూపర్‌ సిక్‌

సూపర్‌ సిక్‌2
2/7

సూపర్‌ సిక్‌

సూపర్‌ సిక్‌3
3/7

సూపర్‌ సిక్‌

సూపర్‌ సిక్‌4
4/7

సూపర్‌ సిక్‌

సూపర్‌ సిక్‌5
5/7

సూపర్‌ సిక్‌

సూపర్‌ సిక్‌6
6/7

సూపర్‌ సిక్‌

సూపర్‌ సిక్‌7
7/7

సూపర్‌ సిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement