అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం, రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 130 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 3,220 మద్యం బాటిల్స్‌ను ఎకై ్సజ్, పోలీస్‌శాఖల అధికారులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. అలాగే పట్టుబడ్డ నాన్ డ్యూటీ పెయిడ్, డ్యూటీ పెయిడ్‌కు సంబంధించి 859 లీటర్ల మద్యాన్ని, 9 కేసుల్లో దొరికిన 56 లీటర్ల సారాను పారబోశారు. అమలాపురం 30వ వార్డు రజకపేట శివారులో మద్యం బాటిళ్లను ధ్వంసం చేయడంతోపాటు మద్యాన్ని, సారాను గొయ్యి తీసి అందులో పారబోసి పూడ్చారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వై.చైతన్య మురళి, జిల్లా ఎస్పీ బి.కృష్ణారా వు ఆదేశాల మేరకు అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పర్యవేక్షణలో మద్యాన్ని ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment