అమ్మాయిలే మిన్నగా.. | - | Sakshi
Sakshi News home page

అమ్మాయిలే మిన్నగా..

Published Wed, Mar 5 2025 12:05 AM | Last Updated on Wed, Mar 5 2025 12:04 AM

అమ్మా

అమ్మాయిలే మిన్నగా..

జెడ్పీ విద్యార్థులే ఎక్కువ

ప్రభుత్వ యాజమాన్యాల వారీగా చూస్తే జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులే పది పరీక్షలకు అధికంగా హాజరవుతున్నారు. జెడ్పీ యాజమాన్యం నుంచి అత్యధికంగా 9,204 మంది విద్యార్థులు హాజరవుతుండగా, ఆ తర్వాత ప్రైవేట్‌ యాజమాన్యం నుంచి 5,867 మంది హాజరవుతున్నారు. మున్సిపల్‌ యాజమాన్యం నుంచి 708, ప్రభుత్వ పాఠశాలల నుంచి 388, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి 28, ఏపీ సోషల్‌ వేల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నుంచి 150, ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 74 మంది హాజరు కానున్నారు. ఈ ఏడాది రెగ్యులర్‌ పాఠశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న జెడ్పీ విద్యార్థులు 2,097, ప్రభుత్వ పాఠశాలల నుంచి 76, బీసీ సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల నుంచి 68, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ పాఠశాలల నుంచి 277 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

రాయవరం: ఇప్పటికే ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభం కాగా, ఈ నెల 17 నుంచి పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 110 పరీక్షా కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో 19,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఈసారి కూడా బాలికల సంఖ్య అధికంగా ఉండడం విశేషం.

ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు

మాస్‌ కాపీయింగ్‌ను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావించింది. ఈ ఏడాది ప్రైవేటు పరీక్ష కేంద్రాలు చాలా వరకు తగ్గించారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ పరీక్షల విభాగం ముఖ్య ఉద్దేశంగా కన్పిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు, మున్సిపల్‌ పాఠశాలల్లో నాలుగు, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 84, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో రెండు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మూడు, ఎయిడెడ్‌ కళాశాలలో ఒకటి, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 10 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో 10 ప్రైవేటు విద్యాసంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

బాలికలే అధికం

పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల్లో బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంది. జిల్లావ్యాప్తంగా 19,217 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వీరిలో 18,937 మంది రెగ్యులర్‌ విద్యార్థులు కాగా, 206 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో 9,452 మంది బాలురు, 9,485 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ప్రైవేట్‌ విద్యార్థులు 206 మంది, ఓఎస్‌ఎస్‌సీ రెగ్యులర్‌ విద్యార్థులు 73, ఓఎస్‌ఎస్‌సీ ప్రైవేట్‌ ఒకరు పరీక్ష రాస్తున్నారు. గతేడాది పరీక్షలకు 18,787 మంది విద్యార్థులు హాజరు కాగా, ఈ ఏడాది 430 మంది విద్యార్థులు అధికం.

11,12 తేదీల్లో పరీక్ష పేపర్ల సరఫరా

పది పరీక్ష పేపర్ల బండిల్స్‌ ఈ నెల 11, 12 తేదీల్లో మొదటి విడత, 14,15 తేదీల్లో రెండవ విడత జిల్లా కేంద్రానికి చేరుకుంటాయి. వచ్చిన పేపర్లు పరీక్షా కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు చేరుకోనున్నాయి. మొదటి విడతలో తెలుగు, హిందీ, ఇంగ్లిషు పేపర్లు వస్తాయి. రెండవ విడతలో నాన్‌ లాంగ్వేజ్‌ (గణితం, సైన్సు, సోషల్‌) పేపర్లు వస్తాయి.

క్విక్‌ బాక్స్‌లో విజేతలను అభినందిస్తున్న కలెక్టర్‌

పది పరీక్షల్లో బాలికల సంఖ్య అధికం

మేనేజ్‌మెంట్ల వారీగా

జెడ్పీ విద్యార్థులదే సింహ భాగం

ఈ నెల 11,12 తేదీల్లో మొదటి విడత పేపర్ల సరఫరా

ఈ నెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం

జిల్లాలో పది పరీక్షలు

రాసే విద్యార్థులు 19,217

అమలాపురం రూరల్‌: రామచంద్రపురానికి చెందిన కారుమూరి బాల బాలాజీ దేవి ప్రియ కుమార్తె లేఖ నిహారిక ఏడో తరగతి చదువుతూ ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ క్విక్‌ బాక్స్‌ పోటీలలో రెండు గోల్డ్‌ మెడల్స్‌ ,ఒక సిల్వర్‌ మెడల్‌ సాధించడం అభినందనీయమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్‌లో వరల్డ్‌ కప్‌ కు ఎంపికై న లేఖ నిహారికను మెడల్స్‌ అందించి అభినందించారు. ద్రాక్షారామంకు చెందిన అల్లం రాజేష్‌ కుమారుడు ప్రియదర్శిని కార్తీక్‌ ఆరో తరగతి చదువుతూ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ కిక్‌ బాక్స్‌ పోటీలలో ఒక సిల్వర్‌, గోల్డ్‌ మెడల్‌ పతకాలు సాధించడం సంతోషకరమని అన్నారు. ఇద్దరికి కలెక్టర్‌ చేతుల మీదుగా మెడల్స్‌ను బహూకరించారు. కోచ్‌ బీకే. రత్నం, తల్లిదండ్రులు రాజేష్‌, బాల బాలాజీ దేవి ప్రియ పాల్గొన్నారు.

లోటుపాట్లకు తావు లేకుండా..

పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా చూడాలని ఆదేశాలు ఇస్తున్నాం. పరీక్షలను ప్రశాంతం వాతావరణంలో నిర్వహించాలని సూచిస్తున్నాం. ముఖ్యంగా మాస్‌ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కింది స్థాయికి ఇస్తున్నాం.

– డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
అమ్మాయిలే మిన్నగా..1
1/2

అమ్మాయిలే మిన్నగా..

అమ్మాయిలే మిన్నగా..2
2/2

అమ్మాయిలే మిన్నగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement