
భయం గుప్పెట్లో వేట్లపాలెం ప్రజలు
సామర్లకోట: వేట్లపాలెంలో గత ఏడాది డిసెంబరు 15న రెండు (కల్దారి, బత్సల) కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తు లు హత్యకు గురి కావడంతో 23 మంది నిందితులను గుర్తించి కేసు నమోదు చేసిన విషయం విదితమే. 23 మందిని కోర్టుకు హాజరు పర్చగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిలో 20 మంది బెయిల్‌పై సోమవారం సాయంత్రం విడుదల కావడంతో మంగాయమ్మ కాలనీ వాసులు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో కాల్దారి చంద్రరావు(60, కాల్దారి ప్రకాశరావు(55) కల్దారి ఏసు (45) చనిపోయిన విషయం తెలిసిందే. హత్య జరిగినప్పటి నుంచి మంగాయ్మమ్మ కాలనీలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు. పోలీసులను పెంచి పికెట్ కొనసాగించి గ్రామంలో ప్రశాంత వాతావరణం ఏర్పడే విధంగా కృషి చేయాలని వేట్లపాలెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు నిఘా ఉండే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరావు ఆధ్వర్యంలో సీఐ ఎ.కృష్ణభగవాన్ ప్రత్యేక నిఽఘా ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు శాంతంగా ఉండాలని సీఐ రెండు వర్గాలకు సూచించారు.
హత్య కేసులో 20 మంది నిందితులు విడుదల
పోలీసు పికెట్ కొనసాగించాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment