ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ
అమలాపురం టౌన్: జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్, ఫేక్ న్యూస్‌లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి (డీఆర్వో) బీఎల్‌ఎస్ రాజకుమారి చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విలిజేటర్లను ఆదేశించారు. అమలాపురంలో పరీక్షలు జరుగుతున్న రెండు కేంద్రాలను ఆమె మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో ఆయా పరీక్షా కేంద్రాల్లో ఆమె మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను డీఆర్వో పరిశీలించారు. వేసవి ఎండల నేపథ్యంలో పరీక్షల హాళ్లలో విద్యార్ధులకు తాగునీటి వసతిపై ఆరా తీశారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ఆమె పరిశీలించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయా...? లేదా... అనే అంశంపై తనిఖీలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాతో నిఘా, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల అధికారులతో ఆమె పరీక్షా కేంద్రాల వద్ద చర్చించి వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షల నిర్వహణలో ఇంటర్ విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, పోలీస్, ప్రజా రవాణా, వైద్య ఆరోగ్య, విద్యుత్, పోస్టల్ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసే విధానంపై కూడా డీఆర్వో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment