అమలాపురం టౌన్: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిషు, ఒకేషనల్ పరీక్షలకు 468 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంగ్లీషుకు 9,985 మంది హాజరు కావాల్సి ఉండగా 317 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 2,347 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 151 మంది గైర్హాజరైనట్టు డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాల్లో బుధవారం ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, మూడు సిటింగ్ స్క్వాడ్స్ , జిల్లా పరీక్షల కమిటీ సభ్యులతో పాటు తాను పలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేసినట్టు డీఐఈవో ఆయన తెలిపారు.
విద్యార్థినికి అస్వస్థత
ముమ్మిడివరం: స్థానిక తారా కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ పరీక్షా కేంద్రంలో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన చందన బుధవారం ఇంగ్లిషు పరీక్ష రాస్తుండగా కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకుంది. దీంతో ఇన్విజిలేటర్ స్థానిక పోలమ్మ చెరువు పీహెచ్‌సీ వైద్యులు పర్ణిక, సత్యనారాయణతో ఆమెకు వైద్యం చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించి తిరిగి పరీక్షా కేంద్రానికి తీసుకు వెళ్లి పరీక్ష రాయించారు.
నేడు గీత కార్మికుల
మద్యం షాపుల లాటరీ
అమలాపురం రూరల్: కలెక్టరేట్ గోదావరి భవనంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కల్లు గీత కార్మికుల మద్యం షాపుల ఎంపికకు గురువారం ఉదయం 11 గంటలకు లాటరీ నిర్వహిస్తునట్లు అమలాపురం ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేడీవీ ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో షాపుల టెండర్లను కలెక్టర్ మహేష్‌కుమార్ అధ్వర్యంలో తెరుస్తామన్నారు. 13 మద్యం షాపులకు 261 టెండర్లు వచ్చాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment