విద్యార్థినులకు చిత్ర లేఖన పోటీలు
అమలాపురం టౌన్: ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు రోజులుగా వివిధ మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయం బుధవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆ కార్యక్రమాలను వివరించారు. మహిళల భద్రత, హక్కులు, సాధికారత, మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బాలికలకు గుడ్ టచ్ బాడ్ టచ్ గురించి వివరణ ఇస్తున్నామని తెలిపింది. మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇదే సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లాలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థినులకు మహిళా చైతన్యం, ఆత్మ రక్షణ తదితర అంశాలపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో విద్యార్థినులకు బుధవారం మహిళల ‘ధైర్య సాహసాలు’ అనే అంశంపై చిత్ర లేఖన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment