
భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తుల తాకిడికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలని కొత్తపేట ఆర్‌డీఓ పీ శ్రీకర్ దేవదాయ – ధర్మాదాయ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఏప్రిల్ 7 నుంచి 13 వరకు కల్యాణోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో గురువారం దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆర్డీఓ శ్రీకర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీసీ అండ్ ఈఓ సూర్యచక్రధరరావు కల్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్య అంచనా, ఏర్పాట్లు, దేవదాయ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల పాత్ర, కల్యాణోత్సవ వేదిక, వాహనాల పార్కింగ్ తదితర అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీకర్ మాట్లాడుతూ ఈ వాడపల్లి వేంకటేశ్వరస్వామి క్షేత్రం భక్తుల విశ్వాసంతో దినదినాభివృద్ధి చెందుతున్నందున ప్రతీ శనివారంతో పాటు ఇతర రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చే భక్తులు, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక కల్యాణోత్సవాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతుందనే అంచనాలతో ఏర్పాట్లు చేయాలన్నారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్ హెడ్ వర్క్స్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీసీ, అగ్నిమాపక, రెవెన్యూ, దేవదాయ, పోలీస్ తదితర శాఖల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లను వివరించారు. శానిటేషన్‌పై దష్టి పెట్టాల్సిందిగా సూచించారు. అనంతరం ఆలయ ఆవరణ, పరిసరాలు, పార్కింగ్, కల్యాణ వేదిక స్థలాలను ఆర్‌డీఓ శ్రీకర్, డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఇతర అధికారులు పరిశీలించారు. డీఎల్‌పీఓ రాజు, డీఎల్‌డీఓ రాజేశ్వరరావు, ఆత్రేయపురం తహసీల్దార్ టి.రాజరాజేశ్వరరావు, ఎంపీడీవో బీకేఎస్‌ఎస్ వీ రామన్, ఆత్రేయపురం ఎస్సై ఎస్. రాము, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 7 నుంచి 13 వరకు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న
కల్యాణోత్సవాలు
ఉత్సవాల నిర్వహణపై ఆర్డీవో
శ్రీకర్ అధికారులతో సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment