
కృషితో నాస్తి దుర్భిక్షం
ఫ ఇంటికి ఆర్థిక తోడ్పాటు
ఫ తక్కువ పెట్టుబడితో అధికాదాయం
ఫ ప్రకృతి సేద్యంలో నారీ విప్లవం
ఫ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
మామిడికుదురు/కొత్తపేట: నారీమణులకు సాధ్యం కాని రంగం అంటూ ఏదీలేదు. ప్రతి రంగంలోను వారు రాణిస్తూ ఔత్సాహికులకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో 28 మంది మహిళా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో కొబ్బరి, అరటిలో అంతర పంటలు పండిస్తూ అధిక దిగుబడులు, అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. ప్రకృతి సేద్యంలోనూ పురుషులతో సమానంగా రాణిస్తూ అధికారుల ప్రశంసలందుకుంటున్నారు. ఒకే సమయంలో పలు పంటలు పండిస్తూ ప్రతిభను చాటుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మామిడికుదురు, కొత్తపేట ప్రాంతాల మహిళల విజయగాధలను పరిశీలిద్దాం...
స్వశక్తిపై ఆధారపడాలన్నదే లక్ష్యం
రాజోలు మండలం కడలి గ్రామానికి చెందిన కుసుమ పద్మావతి బీఏ, బీఈడీ, అగ్రికల్చర్ జనరల్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా నలుగురికి ఆదర్శంగా నిలవాలన్న సంకల్పంతో ఆమె వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించారు. 2019 నుంచి ఆమె ప్రకృతి సాగు చేస్తున్నారు. తమ పూర్వీకులు కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ దిశగా ముందడుగు వేశారు.
ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని..
రసాయనిక, క్రిమి సంహారక ఎరువులతో వ్యవసా యం చేయడం వల్ల అనేక దుష్పరిణాలు ఏర్పడుతున్నాయి. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. దీని నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతో ఈదరాడ గ్రామా నికి చెందిన చెల్లుబోయిన రాధ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపించారు. ఆమె బీఏ చదివారు. అధికారుల సూచనలు, సలహాలతో 2021 నుంచి నిరంతరాయంగా కూరగాయల పంటలతో పాటు వరి, కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తున్నారు. పశువుల పెంట, మూత్రంతో జీవామృతం తయారు చేస్తూ సాగులో వినియోగిస్తున్నారు. క్రిముల నివారణకు వేపాకుతో తయారు చేసిన నీమాస్త్రం వినియోగించి విజయవంతంగా పంటలను సాగు చేస్తున్నారు.
తక్కువ ఖర్చుతో..
ఈదరాడ గ్రామానికి చెందిన కుడుపూడి జానకి ఇంటర్ బైపీసీ చదువుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలు వినియోగంతో ఆమె కుటుంబ సభ్యులకు షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చింది. దీంతో పాటు వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. దీంతో ఆమె ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించారు. 2018 నుంచి ఆమె ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. దీని ద్వారా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తున్నారు. తక్కవ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తూ ఆమె ముందుకు వెళ్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఈ ప్రాంతంలో పలువురు మహిళా మణులు ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండిస్తున్నారు.
అంతర పంటలతో
అదనపు ఆదాయం
కొత్తపేట మండలం బిళ్లకుర్రు శివారు కముజువారిపాలేనికి చెందిన కముజు అరుణకుమారి ప్రకృతి వ్యవసాయం చేస్తూనే, ఫార్మర్ సైంటిస్టుగా పనిచేస్తూ మహిళలను ఈ రంగంలో చైతన్యవంతులను చేస్తున్నారు. తమ 1.50 ఎకరాల విస్తీర్ణం (కౌలు భూమి) లో ప్రధాన పంటగా అరటి పంట సాగు చేస్తూ దానిలో పంట తీసి పంట వేసే పద్ధతిలో అంతర పంటలుగా చెట్టు చిక్కుడు, వంగ, బీర, ఆనబ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, బంతి, నిమ్మ, జామ, సపోట, మునగ పంటలు సాగు చేస్తున్నారు. ఘన, ద్రవ పదార్థాలు, జీవామృతం, నీరు నిమిత్తం నెలకు రూ.2 వేలు ఖర్చు పోను అరటి కాకుండా అంతర పంటల ద్వారా రూ.10 నుంచి రూ.12 వేల అదనపు ఆదాయం లభిస్తోంది. ఇలా కొత్తపేట మండలం వానపల్లి ప్రకృతి వ్యవసాయం యూనిట్ పరిధిలో 10 మంది మహిళా రైతులు, సిబ్బంది లబ్ధి పొందుతున్నారు.
ఈదరాడలో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న నారీమణులు
ఆర్థిక అభివృద్ధి సాధనే లక్ష్యం
మహిళల ద్వారా ఆర్థిక అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయాధారంగా కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ రంగంలో మహిళలను ప్రోత్సహిస్తున్నాయని జిల్లా పాయింట్ పర్సన్ (డీపీపీ) సీహెచ్ సంధ్య తెలిపారు. ఫార్మర్ సైంటిస్ట్‌లకు హెడ్‌గా పనిచేస్తున్న ఆమె జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వాల ప్రోత్సాహం, మహిళల ఆర్థిక ప్రగతి గురించి వివరించారు. జిల్లాలో 22 ప్రకృతి వ్యవసాయ యూనిట్లు (గ్రామాలు) ఏర్పాటుచేసి అతి తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ రంగంలో పొదుపు దగ్గర నుంచి మహిళలను చైతన్యవంతం చేయడంలో భాగంగా ముందుగా కిచెన్ గార్డెన్స్ అబివృద్ధి చేయడం ద్వారా ఒక్కో కుటుంబానికి కూరగాయలు, ఆకు కూరలు పండించి, నెలకు కనీసం రూ.2 వేలు ఆదా చేసుకునేలా ప్రోత్సహించాం. 20 సెంట్ల స్థలం ఉంటే నెలకు రూ.25 వేలు ఆదాయం ఆర్జిస్తున్నారు. కోర్సు నేర్చుకుంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళలకు రూ.10 వేలు స్టైఫండ్ ఇస్తున్నాం. ఇలా జిల్లాలో 28 మంది మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారని విరించారు.

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం

కృషితో నాస్తి దుర్భిక్షం
Comments
Please login to add a commentAdd a comment