
మహిళా సమానత్వంతో సమాజ వికాసం
ఫ మహిళా దినోత్సవంలో జేసీ నిశాంతి
ఫ అవగాహన ర్యాలీ, మానవహారం
అమలాపురం టౌన్: సమాజ నిర్మాణంలో సగ భాగంగా ఉన్న మహిళలు అన్నింటిలోనూ సమానత్వంతో ముందుకు సాగుతూ సమాజ వికాసానికి మూలమవుతున్నారని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. తొలుత కలెక్టరేట్ నుంచి నల్లవంతెన వరకూ మహిళా చైతన్యంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. మనమంతా దేవతగా కొలిచే సీ్త్ర మూర్తిపై జరుగుతున్న అత్యాచార సంస్కృతికి చరమ గీతం పాడేలా ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, ఉద్యోగ, అంతరిక్షం, సాంకేతక విప్లవం తదితర రంగాల్లో మహిళలు దూసుకువెళ్లుతున్న పరిణామాలే మహిళా సాధికార ప్రగతికి మెట్లు అవుతున్నాయన్నారు. కలెక్టరేట్ నుంచి దాదాపు కిలోమీటరు మేర మెయిన్ రోడ్డుపై మహిళలు, పోలీసులతో ర్యాలీ నల్లవంతెన వరకూ సాగింది. నల్ల వంతెన వద్దకు ర్యాలీ చేరుకున్నాక అక్కడ మానవ హారం నిర్వహించి మహిళలకు అన్ని విధాల రక్షణగా ఉంటామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతకుమారి, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, అమలాపురం పట్టణ, రూరల్ సీఐలు పి.వీరబాబు, డి.ప్రశాంత్‌కుమార్, పట్టణ ఎస్సై కిషోర్‌బాబుతో పాటు మహిళా పోలీసులు, డీఆర్‌డీఏ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ల మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
అమలాపురం రూరల్: స్థానిక సత్యనారాయణ గార్డెన్స్‌లో శనివారం జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేసినట్లు జేసీ టి.నిశాంతి తెలిపారు. శుక్రవారం అక్కడి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సాస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు, అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖలకు సంబంధించి ఉత్తమంగా నిలిచిన సంక్షేమ పథకాల స్టాల్స్, పథకాల నిర్వహణపై లబ్ధిదారుల అభిప్రాయ సేకరణ ఉంటాయని ఆమె తెలిపారు. అదే విధంగా వేదిక సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఇతర ప్రాధాన్య ఏర్పాట్లను సమీక్షించి, వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్పులను చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత దిశగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ శాంత్ కుమారి, డీపీఎం విజయకుమార్, మెప్మా, పరిశ్రమల కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment