
మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస
సఖినేటిపల్లి: జిల్లాలోని మోరి చేనేత సొసైటీ వస్త్రాలను ఆదివారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. నేషనల్ డిజైన్ సెంటర్(సెట్ అప్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్) ఆధ్వర్యంలో సౌత్ ఇండియా అమృత్ మహోత్సవ్‌లో ఏపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోరి చేనేత స్టాల్‌ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోరి చేనేత సొసైటీ స్టాల్‌లోని చేనేత వస్త్రాలను రాష్ట్రపతి పరిశీలించారు. ఆమె వెంట ఏపీ గవర్నర్ ఉన్నారు. చేనేత చీరల తయారీలో కార్మికుల నైపుణ్యాన్ని రాష్ట్రపతి ప్రసంశించినట్టు స్టాల్ సేల్స్‌మన్, మోరికి చెందిన నల్లా ప్రసాద్ తెలిపారు.
సుదర్శన హోమానికి రూ.లక్ష విరాళం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివా రి ఆలయంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమానికి హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన అవసరాల సూర్య బాయన్నపంతులు రూ.లక్ష విరాళం ఆదివారం అందజేశారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఆయనకు స్వామివా రి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు.
నిత్యాన్నదాన పథకానికి..
అంతర్వేది ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి ఏలూరుకు చెందిన మద్దిపట్ల ఆనంద్‌కుమార్‌శర్మ రూ.50 వేల విరాళం అందజేశారు. ఆలయంలో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణకు విరాళాన్ని అందజేసి, స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ విజయసారథి పాల్గొన్నారు.
నేడు యథావిధిగా గ్రీవెన్స్
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని డీఆర్వో రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఎప్పటిలాగే జరుగుతుందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిందన్నారు. దీంతో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.
జిల్లా స్థాయి విజ్ఞాన సంబరాలు నేడు ముగింపు
ముమ్మిడివరం: జిల్లా స్థాయి విజ్ఞాన శాస్త్ర సంబరాల ముగింపు వేడుకలు స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహిస్తున్నట్టు జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గత నెల 28 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముగింపు వేడుకలను నిర్వహించి, వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. అనంతరం జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ప్రాథమిక స్థాయిలో విజేతలైన విద్యార్థులకు ప్రత్యేకంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లల్లో పరిశోధన దృక్పథంపై, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశమని సుబ్రహ్మణ్యం తెలిపారు.
లోవ దేవస్థానానికి తరలివచ్చిన భక్తులు
రూ.3.65 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 18వేల మంది భక్తులు క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయా ల ద్వారా రూ.1,39,305, పూజా టికెట్లకు రూ. 86,900, కేశఖండన శాలకు రూ.13,960, వాహ న పూజలకు రూ.3,890, వసతి గదులు, పొంగ లి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.43,756, విరాళా లు రూ.77,609 వెరసి మొత్తం రూ.3,65,420 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.

మోరి చేనేత వస్త్రాలకు రాష్ట్రపతి ప్రశంస
Comments
Please login to add a commentAdd a comment